వరుస సెలవులు.. యాదాద్రికి పోటెత్తిన భక్తులు!

కలం యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయ (Yadadri Temple) కొండపై భక్తి సందడి అంబరాన్నంటింది. రెండో శనివారం, ఆదివారం వరుసగా రావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొండపై ఎటుచూసినా భక్తుల సందడి.. స్వామివారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. స్వామివారి దర్శనంతో పాటు శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నిర్వహించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపారు.

వ్రత మండపం వద్ద రద్దీ పెరిగింది. దేవస్థానం అధికారులు అదనపు సిబ్బందిని నియమించి వ్రతాల నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. రద్దీకి అనుగుణంగా దర్శనం, ప్రసాదం, వ్రతాలు, ఆర్జిత సేవల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. వ్రత మండపంలో భక్తులు ప్రశాంతంగా పూజలు నిర్వహించుకునేలా అదనపు సిబ్బందితో సేవలందిస్తున్నారు.

సెలవులొస్తే స్వామివారి సన్నిధికే..

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రికి వారాంతపు సెలవుల్లో భక్తుల రాక పెరుగుతోంది. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడంతో క్షేత్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం సిబ్బందికి సహకరించాలని, అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం, వ్రతాలు నిర్వహించుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. సెలవుల వేళ యాదాద్రికి పెరిగిన భక్తుల తాకిడి.. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడమే దేవస్థానం ముందున్న కీలక బాధ్యతగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>