కలం, సినిమా: స్పెషల్ క్యారెక్టర్లతో, వరుస సినిమాలతో సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishnan) ఇప్పటికీ వెండితెరపై ఓ వెలుగు వెలిగిపోతున్నారు. బాహుబలి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆమె మరో స్థాయికి వెళ్లిపోయారు. ఇక రమ్యకృష్ణ ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi ) భార్య అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా రమ్య, వంశీతో విడిపోయారన్న రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్య కృష్ణ స్పందించారు. తాము ఇప్పటికీ పెళ్లి బంధంలోనే ఉన్నామని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే తమ కొడుకు కోసం ఇద్దరూ వేర్వేరు సిటీలో ఉండాల్సి వస్తోందన్నారు.
గతంలో తాను సీరియల్స్‌లో నటించినప్పుడు పదిహేను రోజులకు ఓసారి చెన్నై టూ హైదరాబాద్ తిరగాల్సి వచ్చేదన్నారు. ఆ సమయంలో తన కొడుకు తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవాడన్నారు. దీంతో కొడుకును చెన్నైలోనే స్కూల్లో జాయిన్ చేపిద్దామని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అందరిలాగా తాము ఫైటింగ్ చేసుకునే జంట కాదని, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నామని స్పష్టం చేశారు. వేర్వేరు సిటీల్లో ఉన్నా పెళ్లి బంధంలోనే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. అయితే రమ్యకృష్ణ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న చర్చలు సాగుతున్నాయి. భార్యభర్తలు అయి ఉండి బెటర్ ఫ్రెండ్స్ అని చెప్పడం ఏంటని, అసలు వీళ్లు మాట్లాడుకుంటున్నారా? లేదా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

