స్పీచ్ ఇస్తుండ‌గా మైక్ క‌ట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరంగం

క‌లం, వెబ్‌డెస్క్‌: ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో జరిగిన జౌల్‌జీబి జాతరలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం పుష్కర్ సింగ్ ధామి సమక్షంలోనే ధార్చులా కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామి (Harish Singh Dhami) మైక్‌ను విసిరికొట్టి నిరసన తెలిపారు. సీఎం వేదిక నుంచి వెళ్లిపోయిన తర్వాత తాను మాట్లాడుతుండ‌గా మైక్ కట్ చేశారని, తన నియోజకవర్గ సమస్యలను మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. రోడ్ల దుస్థితి, అభివృద్ధి హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలను ప్రస్తావించేందుకే తాను మైక్ తీసుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే సౌండ్ సిస్టమ్ బంద్‌ చేశారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ సీఎం వర్గం ప్రొటోకాల్ ఉల్లంఘించిందని ఆరోపించింది.

ఈ నేపథ్యంలో సీఎం పుష్కర్‌ సింగ్ ధామికి ఎమ్మెల్యే హరీశ్ ధామి బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ధార్చులా నుంచి తనపై పోటీ చేయాలని, లేదా సీఎం కోరుకునే ఏ స్థానికైనా పోటీ చేయడానికి తాను సిద్ధమని సవాల్ చేశారు. ఈ ఘటనపై ప్రజలకు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఇది తన ఒక్కడి అవమానం కాదని, ధార్చులా ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై తాజాగా పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామితో పాటు మ‌రో ఐదుగురిపై కేసు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>