అమితాబ్ బచ్చన్ ఇంటిపై కాల్పులకు కుట్ర.. ఇద్దరు అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నివాసంపై కాల్పులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌కు చెందిన వికాస్ ఠాకూర్(జలంధర్), దీపక్ సింగ్ (తరన్ తారన్)లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ విదేశాల్లో ఉంటున్న ఓ గ్యాంగ్ స్టర్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి అమితాబ్ బచ్చన్ చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలే ఈ కుట్రకు కారణమని తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అమితాబ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే, 1984 అల్లర్లకు సంబంధించి తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అమితాబ్ బచ్చన్ గతంలోనే ఖండించారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇక అరెస్టయిన వికాస్ ఠాకూర్ ఓ వ్యాపారిపై కాల్పులు జరిపేందుకు ఢిల్లీకి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. మరో నిందితుడు దీపక్ సింగ్‌కు కూడా క్రిమినల్ కేసులతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమృత్ సర్‌లో అక్టోబర్ 3న జరిగిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మ్యాడ్ సంధు హత్య కేసులోనూ దీపక్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>