కలం, సినిమా: వెర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush), మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం: చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నవంబర్ 20న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇటీవలే ‘అమరన్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి కథను అందించి, స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో ధనుష్, మమ్ముట్టిలతో పాటు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా, మలయాళ విలక్షణ నటుడు ఇంద్రన్స్, టాలీవుడ్ యంగ్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఉన్న క్యూరియాసిటీ డబుల్ చేశారు. ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. మాస్, యాక్షన్ వైబ్స్ తో దర్శకుడు రాజ్‌కుమార్ తనదైన కథనంతో ఓ స్పెషల్ ట్రీట్ అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని ఇంటెన్సిటీని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. సాయి అభ్యంకర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్. ఈ వీడియోలోని విజువల్స్, క్యారెక్టర్ ఎలివేషన్స్ అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.

