కలం, మహబూబ్నగర్ బ్యూరో: నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడిని నిజం చేస్తూ దేశం గర్వించే స్థాయికి ప్రతి విద్యార్థి ఎదగాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) ఆకాంక్షించారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో బాలల దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులే నవోదయ పాఠశాలలో ఎక్కువగా ఉంటారనీ,ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదువుకుని దేశం నాకేమిచ్చింది అని కాకుండా దేశానికి నేనేమీ ఇవ్వగలను అని విధంగా తయారు కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాల పనిలో తల్లిదండ్రులకు సహాయం చేయాల చేస్తూ చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. ఇప్పటి నుంచే పురాణ ఇతిహాసాలు, భారతదేశ చరిత్ర తెలుసుకోవాలని ఆమె సూచించారు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి, దేశం కోసం, సమాజం కోసం పని చేయాలని, తద్వారా అందరి గర్వించే విధంగా మీరందరూ ఎదగాలని ఆమె అన్నారు. అంతకుముందు ఆమె విద్యార్థులతో ముచ్చటించారు.

