కలం, కరీంనగర్ : కరీంనగర్ జోన్ పరిధిలోని నారాయణ పాఠశాలల విద్యార్థులకు నగరంలో నారాయణ ప్రీమియర్ లీగ్ (Narayana Premier League) క్రీడా పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం క్రీడల్లో పాల్గొన్న విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల జీఎం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థల్లో ప్రతి సబ్జెక్టును ఇంటరాక్టివ్ పద్ధతిలో బోధిస్తున్నామని చెప్పారు.
విద్యార్థుల పాఠ్యాంశ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అనుభవజ్ఞులైన నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వాటి ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందేలా కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు విద్యార్థి దశ నుంచే ఒత్తిడిని తట్టుకునేలా మానసిక వికాస కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ బన్సిలాల్, హెచ్ఆర్ మౌళి, డీజీఎం వెంకట రమణ రెడ్డి, ఏజీఎం చైతన్య రావు, ఆర్ఐ సత్యం రావు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అకడమిక్ డీన్లు, ఏవోలు పాల్గొన్నారు.

