కలం, మహబూబ్నగర్ బ్యూరో: కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్ వైజర్ కార్మికుల జీతభత్యాల పెంపు పట్టించుకోరా? అని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ పాలకులను ప్రశ్నించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇంకా పలు డిమాండ్లతో గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టు కార్మికుల (Hospital Workers Protest) ఆందోళనలో భాగంగా మూడో రోజు భిక్షాటణ బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో కాంటాక్ట్ కార్మికుల జీవితాలు దినదిన గండంగా మారాయన్నారు. రోగుల మలమూత్రాలు ఎత్తిపోసే పారిశుద్ధ్య కార్మికులు ఆత్మగౌరవంతో జీవించాలంటే ఉద్యోగ భద్రతత పాటు కనీస వేతనాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ గోపాల్ నాయక్ బుచ్చన్న కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికులు రంగన్న, బి.చెన్నయ్య, జే.నరసింహ, బాలకోటి, రాఘవేందర్, మన్యం, భీమయ్య, యాదయ్య, నరేష్,కృష్ణ,యాదగిరి, శ్రీను,మున్నా,శ్రీనివాస్ రెడ్డి,చిన్నయ్య, శ్రీశైలం,శంకర్, బాలరాజ్, రామకృష్ణ, శ్రీనివాసులు, అంజలయ్య, వసంత,పద్మ, సత్యమ్మ,నాగమణి,చంద్రకళ, అలివేల, శిరీష,తిరుపతమ్మ,పద్మమ్మ,జ్యోతి,నిర్మల మమత సునీత మంజుల జమున అరుణ కవిత మీనా సంధ్య నాగమ్మ,లక్ష్మి,వెంకటమ్మ,కవిత,అంజలమ్మ,సాయమ్మ,బాలమణి,కళమ్మ,గీత,జ్యోతి,లక్ష్మి దేవి, లక్ష్మమ్మ,సంజనా,రపుల్ నిస బేగం తదితరులు పాల్గొన్నారు.

