కలం, నిర్మల్ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో ‘గురు శ్రేష్ఠ – 2026’ (Guru Shreshtha) ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేందుకు అవార్డులు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, టీఆర్ఎస్ఎంఏ నిర్మల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ పుండ్రు సుధాకర్‌రెడ్డి, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

