ఢిల్లీలో నిలదీస్తారా.. తలవంచి వస్తారా? : హరీశ్​ రావు

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ నీటి ప్రయోజనాలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? లేక తలవంచి మౌనంగా తిరిగొస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి తక్షణ అనుమతులు సాధించాలని డిమాండ్ చేశారు.

అయితే 47 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ పూర్తయిన సమ్మక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కొత్త మార్గదర్శకాల పేరుతో కేంద్ర జల సంఘం వెనక్కి పంపడం దారుణమని హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. దీనిని పాత నిబంధనల ప్రకారమే ఆమోదించి వెంటనే టీఏసీ అనుమతి ఇప్పించాలని కోరారు. అలాగే గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని, ఇందులో తెలంగాణకు 50 శాతం వాటా కింద 75 టీఎంసీలు కేటాయించాలని హరీశ్ రావు స్పష్టం చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో గోదావరి – కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను పోలవరం – బనకచర్ల వైపు మార్చే కుట్ర జరుగుతోందని హరీశ్ రావు ఆరోపించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలని సూచించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీకి అనుకూలంగా వ్యవహారిస్తే సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రాష్ట్ర నీటి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ మరో ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతుందని హరీశ్ రావు వెల్లడించారు.

Also Read : షేక్ హసీనా అప్పగింతకు భారత్ ఓకే.. రెండు కండీషన్లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>