ఒక్క వికెట్ తేడాతో పాక్‌పై భార‌త్‌ అద్భుత విజయం

క‌లం, స్పోర్ట్స్: అండర్-19 ఆసియా కప్ (U19 Asia Cup) ఫైనల్ భారత్ దాయాది పాకిస్థాన్‌పై దండయాత్ర చేసింది. తొలుత పాకిస్థాన్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగినా ఇండియా చేతిలో ఓటమి తప్పలేదు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అండర్‌-19 ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ 107 పరుగులతో చెలరేగగా.. అబ్దుల్ ఖాదిర్ 80, కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 63 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కావ్య పటేల్ నాలుగు, చిగురుపాటి వెంకట మూడు వికెట్లు తీశారు.

విజృంభించిన‌ ఆర్యవీర్, లక్ష్య

338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ 61 బంతుల్లో 58 పరుగులు చేశాడు. తొమ్మిది ఫోర్లు బాదాడు. మోచేతికి గాయమైనా పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించాడు. కెప్టెన్ లక్ష్య రైచందాని 91 బంతుల్లో 80 పరుగులతో రాణించాడు.

చివర్లో ఉత్కంఠ పోరు

ఒక దశలో భారత్ 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుకు చేరింది. అయితే మనాల్ చౌహాన్, మోహిత్ ఉల్వా పోరాటంతో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠగా మారింది. మనాల్ 31 బంతుల్లో 47 పరుగులు చేయగా.. మోహిత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

చివరి బంతికి విజయగర్జన

చివరి ఓవర్‌లో భారత్‌కు 8 పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన సమయంలో మోహిత్ ఉల్వా ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఫోర్ బాదాడు. దీంతో భారత్ 339 పరుగులు చేసి ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించి అండర్‌-19 ఆసియా కప్‌(U19 Asia Cup)ను సొంతం చేసుకుంది.

Also Read : శాండ్‌పేపర్ వివాదం.. కమిన్స్‌కు మురళీ కౌంటర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>