కరీంనగర్‌లో మత విద్వేషాల కుట్రపై బీజేపీ ఫిర్యాదు

కలం, కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా ఈద్గా వద్ద రిటైనింగ్ వాల్ (Eidgah Retaining Wall) నిర్మాణం చేపట్టి, మొక్కలు నాటడం ద్వారా మత విద్వేషాలు సృష్టించేందుకు కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్లు కోరారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంకు వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఈద్గా వద్ద ఈ నెల 11న కొందరు వ్యక్తులు రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం కంకర, ఇసుక తీసుకొచ్చి జేసీబీతో పనులు ప్రారంభించారని బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అక్కడ మొక్కలు నాటేందుకు కూడా ప్రయత్నించారని, ఈ పనులకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు.

హిందూ, ముస్లిం వర్గాల మధ్య విద్వేషాలు రగిలించి గొడవలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో బీఆర్ఎస్‌కు చెందిన ఓ ముఖ్య నేత హస్తం ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి కరీంనగర్‌లో ఉద్రిక్తతలు సృష్టించి బీజేపీని అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. ప్రశాంతమైన కరీంనగర్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాలు అందజేసిన వారిలో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, కార్పొరేషన్ విప్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీను, ఉప్పరపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>