కొల్లూరులో డ్రగ్స్ పట్టివేత.. ఒకరి అరెస్ట్

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా కొల్లూరు (Kollur) పోలీస్ స్టేషన్ పరిధిలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి ఎస్‌ఓటీ, కొల్లూరు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన జి.వెంకట సాయి చరణ్ బెంగళూరు నుంచి తక్కువ ధరకు నిషేధిత డ్రగ్స్‌ను కొనుగోలు చేసి, హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 5.5 గ్రాముల MDMA డ్రగ్స్, ఒక కారు, ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>