కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) భద్రతలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కాన్వాయ్‌లో ప్రస్తుతం టయోటా కార్లను పక్కన పెట్టి, ఆరు కొత్త కార్లను వినియోగించబోతున్నారు. దీని కోసం రూ.రూ.1.78 కోట్లతో ఆరు ఆర్బానియా వాహనాల కొనుగోళ్లకు ఏపీ హోం శాఖ జీవో జారీ చేసింది. ఫోర్స్ ఆర్బానియా 4400 WB మోడల్ కారు ఖరీదు రూ.29.67 లక్షలుగా కొటేషన్ చేశారు. జెమ్ పోర్టల్ ద్వారానే ఈ వాహనాల కొనుగోళ్లు చేపట్టాలని హోం సెక్రటరీ కుమార్ విశ్వజీత్ జీవోలో స్పష్టం చేశారు.
వాహనాల కొనుగోళ్లపై గతంలో ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నట్లు జీవోలో వివరించారు. సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్జీ కమాండోలతో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ నివేదిక మేరకు సీఎం భద్రతా కాన్వాయ్‌లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధునాతన టెక్నాలజీతో కూడిన కొత్త కార్లను చేర్చబోతున్నారు.

