హైకోర్ట్ న్యాయ‌మూర్తికి కలెక్టర్, ఎస్పీ స్వాగ‌తం

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ (Justice Pulla Karthik) శనివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ డి. జానకి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్‌కు మొక్కను అందజేసి ఆహ్వానం పలికారు.

అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సమర్పించిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అంతకుముందు జస్టిస్ పుల్లా కార్తీక్ మన్యంకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గద్వాల జిల్లాకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయశాఖ, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>