గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి బైక్ ర్యాలీ..

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లకు (Gig Workers) మద్దతుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి నిర్వహించిన ఈ ర్యాలీకి భారీ స్పందన లభించింది. ముందుగా నోవాటెల్ హోటల్ నుంచి శిల్పారామానికి చేరుకున్న రాహుల్ గాంధీ, అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి గిగ్ వర్కర్ల ర్యాలీని ప్రారంభించారు. ద్విచక్ర వాహనాలపై గిగ్ వర్కర్లతో కలిసి జయభేరి గ్రౌండ్స్ వరకు ప్రయాణించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో డెలివరీ పార్ట్‌నర్లు, ఇతర గిగ్ వర్కర్లు పాల్గొని తమ సంఘీభావాన్ని చాటారు. ర్యాలీ మార్గంలో సందడి నెలకొంది. గిగ్ వర్కర్ల సమస్యలు, వారి జీవన పరిస్థితులు, ఉపాధి భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది.

ర్యాలీ ముగిసిన అనంతరం జయభేరి గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ముఖ్యంగా గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ నేరుగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, డిమాండ్లను తెలుసుకోనున్నారు. వారి అభిప్రాయాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించనున్నారు. గిగ్ వర్కర్లతో అగ్రనేతలు నేరుగా మమేకమవడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>