కలం, వెబ్ డెస్క్: అమెరికా లూసియానా రాష్ట్రంలోని న్యూ ఓర్లీన్స్ పోర్టు సమీపంలో మిసిసిపీ నదిలో భారీ ప్రమాదం (Louisiana boat accident) జరిగింది. అమెరికన్ క్రూయిజ్ లైన్స్‌కు చెందిన ‘అమెరికన్ హెరిటేజ్’ క్రూయిజ్ బోటును ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బోటులో 180 మంది ప్రయాణికులు ఉండగా.. 12 మంది నదిలో పడిపోయారు.
శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో పోర్ట్ ఆఫ్ న్యూ ఓర్లీన్స్ ప్లేస్ వెలుపల లంగరు వేసి ఉన్న అమెరికన్ హెరిటేజ్ క్రూయిజ్ బోటును అట్లాంటిక్ ఆస్ఫాల్ట్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీ కొట్టింది. దీంతో క్రూయిజ్ బోటు బోల్తా పడగా 12 మంది ప్రయాణికులు నదిలో పడిపోయారు.
ఘటన (Louisiana boat accident)పై సమాచారం అందుకున్న సహాయ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. పడవలో ఉన్నవారితో పాటు నదిలో పడిపోయిన వారిని రక్షించారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు మరో టైటానిక్ తరహా ఘటన అని కామెంట్స్ పెడుతున్నారు.

