నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

కలం, ఖమ్మం బ్యూరో: సరైన నంబర్ ప్లేట్లు లేకుండా రోడ్లపై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఖమ్మం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ తల్లాడ హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో నంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు (Khammam Traffic Police) స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ​చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడి తప్పించుకునేందుకు నేరస్తులు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈ ముమ్మర తనిఖీలు చేపట్టారు.

సరైన నంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనదారులకు పోలీసులు జరిమానాలు విధించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు తెచ్చుకుని వాహనాలకు అమర్చుకున్న వారికి పోలీసులు వెసులుబాటు కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ మాట్లాడుతూ, రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలను నిలపడం వల్లే ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని శివ ప్రసాద్ సూచించారు. రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనానికి తప్పనిసరిగా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉండాలని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న ట్రాఫిక్ నిబంధనలకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>