కలం, పాల్వంచ: నేతాజీ యువజన సంఘం (Netaji Youth Association) నిరాశ్రయులకు అండగా నిలిచింది. సంఘం సేవా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని (Palvancha) నిరాశ్రయులు, అభాగ్యులకు రగ్గులు, పండ్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.జె.కె. అహ్మద్, సీనియర్ వైద్యులు డాక్టర్ నామ బుచ్చయ్య చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలోని పెద్దమ్మతల్లి దేవాలయం, సి కాలనీ గేట్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఈ సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ నామ బుచ్చయ్య మాట్లాడుతూ.. మానవసేవే మాధవసేవ అనే భావంతో నేతాజీ యువజన సంఘం ప్రతి ఏడాది చలికాలంలో అనాథలు, నిరాశ్రయులు, అభాగ్యులు, మతిస్థిమితం లేనివారికి రగ్గులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. నేతాజీ యువజన సంఘం అందిస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. యువత తమ పరిసర ప్రాంతాల్లోని అభాగ్యులకు సహాయాన్ని అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు, సమగ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎం.డి. మంజూర్, రిటైర్డ్ సీఐ జారే బిక్షం, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్, పాకాలపాటి కళాపీఠం అధ్యక్షుడు రోశయ్య చౌదరి, న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ ఖాసిం, టి.వి.పి.ఎస్. పాల్వంచ మండల అధ్యక్షుడు ఎస్.ఏ. నయీమ్, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దర్ భాష, నేతాజీ యువజన సంఘం సభ్యులు సయ్యద్ అక్బర్, ఓం ప్రకాష్, ఆసిఫ్, ముగిది శ్రీరామ్, జిల్లేపల్లి స్టాలిన్, ఎం.డి. బాబర్ తదితరులు పాల్గొన్నారు.

