రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

కలం, నిర్మల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు (Road Accident Prevention) పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి రోడ్డు భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రహదారి ప్రమాదాలు పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు సంబంధిత అధికారులంతా కలిసి పని చేయాలన్నారు.

బ్లాక్ స్పాట్ లు గుర్తించి, ఆ ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. వేగ నియంత్రణలు, సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. రహదారుల వెంబడి అక్రమంగా వాహనాలు నిలిపితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై పశువులు సంచరించకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. పశువులు రోడ్లపైకి వదిలే యజమానులకు జరిమానాలు విధించాలని పేర్కొన్నారు.

అవసరమైతే పశువులను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు..రోడ్ల వెంబడి ఆక్రమణలు తొలగించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ రాజేందర్, ఈఈ ఆర్ అండ్ బి సుభాష్, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>