షిరిడీ సాయి స‌న్నిధిలో రామ్ చరణ్!

క‌లం, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. శుక్రవారం షిరిడీకి వెళ్లిన ఆయన సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సాయిబాబా ప్రతిమను బహుమతిగా అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే, ఈ ఏడాది బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>