సమృద్ధి హైవేపై కంటైనర్ బీభత్సం.. నుజ్జునుజ్జయిన కార్లు!

కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా దుసర్‌బీడ్ సమీపంలో శుక్రవారం సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం (Samruddhi Expressway Accident) జరిగింది. బోల్తా పడిన ఒక ట్యాంకర్‌ను క్రేన్ సాయంతో తొలగిస్తున్న నేపథ్యంలో, ముందుజాగ్రత్తగా ట్రాఫిక్ పోలీసులు సుమారు 40 నుంచి 50 వాహనాలను నిలిపివేశారు. అయితే ఇదే సమయంలో నాగ్‌పూర్ నుంచి ముంబై వైపు వేగంగా దూసుకొచ్చిన ఒక కంటైనర్ ట్రక్కు అదుపుతప్పి, వరుసలో నిలిచి ఉన్న సుమారు 15 నుంచి 20 వాహనాలను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ వరుస ప్రమాదంలో వాహనాలన్నీ ఒకదానికొకటి ఢీకొని నుజ్జునుజ్జు కాగా, 22 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి సమీపంలోని మెహ్కర్ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>