టాస్‌ గెలిచిన భారత్​.. బౌలింగ్‌ ఎంచుకున్న శ్రేయస్‌

కలం, వెబ్​ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో (IND vs NZ) భారత్​ టాస్​ నెగ్గింది. టీమిండియా కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ టాస్​ గెలిచి తొలుత బౌలింగ్​ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కివీస్​ జట్టు మొదట బ్యాటింగ్​ చేయనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. ముగ్గురు ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం కల్పించినట్లు సమాచారం.

జట్టు కొత్త కూర్పుతో బరిలోకి దిగుతున్న భారత టీమ్​.. బౌలింగ్‌లో సత్తా చాటి న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 5 వన్డే సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న ఇండియా.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌పై పట్టు బిగించాలని డిసైడ్​ అయింది. మరోవైపు సొంతగడ్డపై భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని కివీస్​ టీమ్​ భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>