అవినీతి పెరుగుతుంటే అభివృద్ధి గొప్పలా?: జగన్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అవినీతి మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) విమర్శించారు. శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందితే.. అభివృద్ధిలో దూసుకుపోతుందని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. విద్యుత్ డిమాండ్ ఎలా తగ్గుతుందో పరిశీలిస్తే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందుల్లో పడిందనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు.

సాధారణంగా రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పడుతుంటే, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంటే.. విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుంటుంని జగన్ విశ్లేషించారు. అభివృద్ధి చెందుతున్న ఏ రాష్ట్రంలో అయినా విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గదన్నారు. కానీ, ఏపీలో 2023–24లో 79,758 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరిగితే, 2025–26 నాటికి 78,546 మిలియన్ యూనిట్లుగా నమోదైందన్నారు.

నిరుద్యోగంలో రెండో స్థానం..

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనావస్థ కారణంగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెరిగిపోతున్నారని జగన్ విమర్శించారు. దేశంలో నిరుద్యోగం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానానికి చేరుకుందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం 23 లక్షల ఉద్యోగవకాశాలు కల్పించామని గొప్పలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023–24లో సొంత పన్నుల ఆదాయం రూ.85,922 కోట్లు ఉంటే, కాగా తాజా లెక్కల ప్రకారం రూ.86,552.65 కోట్లుగా ఉందన్నారను. అంటే రెండేళ్ల కాలంలో వార్షిక వృద్ధిరేటు కేవలం 0.15 శాతం మాత్రమేనని.. ఇది రాష్ట్రంలో తగ్గిన పెట్టుబడులకు తార్కాణంగా నిలుస్తోందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>