కొండా లక్ష్మణ్, కామినేని కుటుంబాలకు బండి సంజయ్ పరామర్శ

కలం, కరీంనగర్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) కొద్దిసేపటి క్రితం హుస్నాబాద్‌లోని ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ కొండా లక్ష్మణ్ (Konda Lakshman) నివాసానికి వెళ్లారు. కొండా లక్ష్మణ్ మాతృమూర్తి కొండా లక్ష్మీ(లస్మవ్వ) ఈనెల 10న మరణించారు. ఈ నేపథ్యంలో లస్మవ్వ చిత్రపటానికి కేంద్ర మంత్రి నివాళి అర్పించారు. కొండా లక్ష్మణ్ ను పరామర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు స్థానిక బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కొండా లక్ష్మణ్‌ను పరామర్శించారు.

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి

మరోవైపు ఇటీవల అనారోగ్యంలో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కామినేని మధుసూదన్ (Kamineni Madhusudan) సతీమణి సరిత మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్ సంతాపం తెలిపారు. గురువారం వావిలాలపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆయనతో పాటు కార్పోరేటర్లు ఒంటెల సత్యనారాయణ రెడ్డి, బండారి వేణు, ప్రవీణ్రావు, హమ్ స్వచ్చంద సంస్థ అధ్యక్షులు ధనపురి సాగర్ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>