పాల్ డైక్‌తో లోకేశ్ భేటీ.. డ్వాక్రా ఉత్పత్తులపై విన్నపం

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని విశాఖపట్నంలో వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్ తో గురువారం మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పత్తులకు (DWCRA Women Products) వాల్‌మార్ట్ (Walmart), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో మార్కెటింగ్ కల్పించాలని విన్నవించారు. స్వయం ఏపీ, లేపాక్షి బ్రాండ్ల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్‌కు అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో సముద్ర ఆహారం, వస్త్రవ్యాపారంలో బలమైన భాగస్వామ్యాలు, ఇన్వెస్ట్ మెంట్ కోసం ఎంఎస్ఎంఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కొనుగోలుదారులను ఏపీకి తీసుకురావాలని కోరారు.

లోకేశ్ వినతులపై పాల్ డైక్ స్పందిస్తూ.. తమ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. ఏపీ రొయ్యల అతిపెద్ద కొనుగోలుదారులలో వాల్ మార్ట్ ఒకటిగా ఉందని చెప్పారు. ఏడాదికి 6.5 కోట్ల పౌండ్లకు పైగా రొయ్యలను తమ సంస్థ కొనుగోలు చేస్తోందన్నారు. అలాగే రాష్ట్రం నుంచి ఫార్మా, వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల వల్ల 28,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ‌-ఉపాధి అవ‌కాశాలు ల‌భించాయని చెప్పుకొచ్చారు. ఏపీ ఎంఎస్ఎంఈ కార్పోరేషన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో ఒప్పందం మేరకు రాష్ట్రంలో 3,200కు పైగా ఎంఎస్ఎంఈలకు శిక్షణ ఇచ్చామని.. వాటిలో 900కు పైగా ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ మార్కెట్‌ప్లేస్‌లో చేర్చామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>