ఆసియా పారా గేమ్స్ స్వర్ణ విజేత దీప్తికి ఘన సత్కారం

కలం, హనుమకొండ: అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన పారా అథ్లెట్ దీప్తి జీవంజిని (Deepthi Jeevanji) ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘనంగా సన్మానించారు. జపాన్‌లో నిర్వహించిన ఆసియా పారా గేమ్స్–2026 (Asian Para Games)లో మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో 56.36 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు.

హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దీప్తి(Deepthi Jeevanji)ని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో సవాళ్లను అధిగమించి పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనతో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయమని అన్నారు. దీప్తి సాధించిన విజయం కేవలం పతకానికే పరిమితం కాదని, ముఖ్యంగా పారా క్రీడాకారులతో పాటు యువతకు ఆత్మవిశ్వాసాన్ని నింపే స్ఫూర్తిదాయక విజయమని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన శిక్షణ, ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. దీప్తి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దీప్తికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దీప్తి తల్లిదండ్రులు, ఇతరులు పాల్గొన్నారు.

Also Read : పర్సనల్‌గా టార్గెట్ చేస్తే పట్టించుకోం: నేరెళ్ల శారద

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>