కలం, వెబ్ డెస్క్: భారత్ వ్యతిరేక శక్తుల కోసమే రాహుల్ గాంధీ (Rahul Gandhi) పనిచేస్తున్నారని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ సమ్మిట్ ద్వారా రాహుల్ గాంధీ విజన్ ను దేశానికి పరిచయం చేస్తారట అంటూ దుయ్యబట్టారు. తన విజన్ ఏంటో రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జర్నలిస్టుల కోసం దీపావళి మిలన్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశంపై విషం చిమ్మెందుకు హైదరాబాద్ ను వేదిక చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ తీరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసమర్థత, విజన్ లేని రాహుల్ గాంధీ డైరెక్షన్ లో రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. దేశ గౌరవాన్ని తగ్గించేలా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రవర్తిస్తున్నారని కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.
Also Read : తెలంగాణ వ్యాప్తంగా ‘కొత్త పింఛన్ల’ పత్రాల పంపిణీ
Follow Us On: Youtube

