పేదలకు ఆర్థిక భరోసాగా ఆసరా పింఛన్లు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

కలం, బోథ్‌ : పేద, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లు (Aasara Pension) ఆర్థికంగా ఎంతో అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. బోథ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 552 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ బాధ్యతని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర ఖర్చుల విషయంలో కొంతమేర ఉపశమనం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>