కలం, కరీంనగర్: స్మార్ట్ సిటీగా ఎంపికైన కరీంనగర్‌లో (Karimnagar) గత కొద్ది సంవత్సరాలుగా డంప్ యార్డ్ (Dump Yard) గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం (Satyam)ఒక ప్రకటనలో అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. డంపు యార్డును తాము తరలిస్తామని చూస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఎగుర లేక పందిరి కురుస అనే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల ముందు బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే నెల రోజుల్లో డంప్ యాడ్ తరలిస్తామని ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చాక సాకులు చెబుతున్నారని అన్నారు. డంపు యార్డ్ ప్రతి సంవత్సరము తగలబడి దట్టమైన ఒక వెదజల్లడం మూలంగా నగరంలో అల్కాపురి కాలనీ, అలుగునూర్, హౌసింగ్ బోర్డ్, కోతిరాంపూర్, కట్ట రాంపూర్, లక్ష్మీ నగర్ తదితర ప్రాంతాలవాసులు శ్వాసకోశ వ్యాధి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాకాలంలో తడిసిపోయి దుర్వాసన వస్తుందని దీని మూలంగా నగర ప్రజలు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. మొదటి నుంచి సీపీఎం ఆధ్వర్యంలో డంపు యార్డ్ పై ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నామని డంపు యార్డును హుజురాబాద్ పరిసర ప్రాంతాలకు తరలిస్తుంటే బండి సంజయ్, బీజేపీ పార్టీ నే అడ్డుకొని నిన్నటి ప్రెస్ మీట్ సందర్భంగా దొంగే దొంగ అన్నట్లు కొంతమంది డంపు యార్డును అడ్డుకుంటున్నారని బండి సంజయ్ మాట్లాడుతున్నారని అనడం అవివేకం అన్నారు. ఇప్పటికైనా డంప్ యార్డును తరలించి నగర ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

