కొరియోగ్రాఫర్ కారును ఢీకొన్న లారీ.. షూటింగ్ నుంచి వస్తుండగా ప్రమాదం!

కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ (Kaaka) సినిమాకు సంబంధించిన ప్రత్యేక పాట షూటింగ్‌ను నిన్న రాత్రి పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌కు ఎలాంటి పెద్ద గాయాలు కాలేదు, ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారు. నిన్ననే ఆయన అయ్యప్ప స్వామి మాల ధరించారని, ఆ స్వామి దయవల్లే పెను ప్రమాదం తప్పిందని సన్నిహితులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>