సర్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం: గుజ్జ శ్రీనివాస రావు

కలం, కరీంనగర్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీనివాసరావు (Gujja Srinivasa Rao) పిలుపునిచ్చారు. బుధవారం తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు చింతం శ్రీనివాస్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన గుజ్జ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ పార్టీ విదేశీ శక్తులతో చేతులు కలిపి రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకే కరీంనగర్‌లో మహా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు.

పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర మాట్లాడుతూ.. దేశంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మనుగడ కష్టంగా మారిందన్నారు. కాంగ్రెస్ పనికిమాలిన రాజకీయాలను ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మువ్వరపు సంపత్, బూట్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గొట్టెముక్కుల తిరుపతి రెడ్డి, వేల్పుల ఓదేలు యాదవ్, బోనాల మోహన్, కొయ్యడ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>