కలం, ఆదిలాబాద్: జాతీయ విద్యా దినోత్సవాన్ని(National Education Day) పురస్కరించుకొని బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రూ, ఎస్. రాజేశ్వర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ రోహిత్, మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ కలీం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

