కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయ చరిత్రలోనే మొదటిసారిగా సిక్ మైనార్టీ విభాగానికి తెలంగాణ రక్షణ సేన (Telangana Rakhshana Sena) ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత నూతనంగా ఎంపికైన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులకు నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ క్రమంలో సిక్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్. జస్బీర్ సింగ్ సంధు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎస్. హర్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు.

