హై అలర్ట్​.. ఎయిర్​ ఇండియా ఫ్లైట్​ కు హైజాక్​ వార్నింగ్​!

కలం, వెబ్​ డెస్క్​: ఎయిర్​ ఇండియా విమానానికి హైజాక్​ బెదిరింపులు (Air India Flight)​ రావడం కలకలం రేపింది. కోల్‌కతా నుంచి ముంబై వెళ్లేందుకు సిద్ధమైన విమానంలో హైజాక్ (Hijack Threat)​ హెచ్చరికతో కూడిన చీటి లభ్యమైంది. వెంటనే అప్రమత్తమైన పైలట్​ ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్​ కు సమాచారం అందించారు. దీంతో భద్రతా దళాలు విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రయాణికులందరిని కిందకు దించారు. భద్రతా తనిఖీల కోసం విమానాన్ని ప్రత్యేక ఐసోలేషన్​ బేకు తరలించారు. ఈ ఘటనతో అధికారులతో పాటు ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఇటీవల దేశంలోని పలు విమానాశ్రయాల్లో బెదిరింపు ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్‌లో ఫూకెట్ నుంచి కోల్‌కతా వచ్చిన ఓ విమానం టాయిలెట్ అద్దంపై ‘విమానంలో బాంబు’ అని రాసి ఉండటంతో విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఇక నవంబర్ 7న బెంగళూరు నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానం (6E-451)లోనూ హైజాక్ హెచ్చరికల కలకలం సృష్టించింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాష్‌రూమ్‌లో ఉన్న బెదిరింపు చీటీ సిబ్బందికి లభించింది. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటంతో విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాటాలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. తాజాగా, ఎయిర్​ ఇండియ ఫ్లైట్​ (Air India Flight) కు హైజాక్​ వార్నింగ్​ రావడం సంచలనంగా మారింది.

Also Read : 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం: ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>