కలం, హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) ను పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. హనుమకొండలోని వడ్డేపల్లిలో ఆయన నివాసం వద్ద పోలీసులు నిర్బంధం విధించారు.
ఇప్పటికే కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో పాటు కాజీపేట డివిజన్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. వారిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు హనుమకొండ పోలీస్ స్టేషన్లో మాజీ కార్పొరేటర్ సోదా కిరణ్, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గంలో వరుస అరెస్టులు, పోలీసుల నిర్బంధాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

