పట్టాలు తప్పిన కోల్‌కతా-సాయిరంగ్ ఎక్స్‌ప్రెస్!

కలం, వెబ్ డెస్క్ : అస్సాంలోని కామరూప్ మెట్రో జిల్లా పరిధిలోని దిగారు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం (Assam Train Accident) చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం సుమారు 6:54 గంటల సమయంలో కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 13125)కు చెందిన ఇంజిన్ సహా ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

ఈ ప్రమాదంపై ఈశాన్య సరిహద్దు రైల్వే స్పందిస్తూ ప్రయాణికులందరూ పూర్తి సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది. బాధితులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ రైలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>