ఆన్‌లైన్ టెండర్లతో రూ.2.40 కోట్ల ప్రజాధనం ఆదా: యెర్రా కామేష్

కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం కార్పొరేషన్‌లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) టెండర్లను ఆన్‌లైన్‌లో నిర్వహించడం వల్ల రూ.2.40 కోట్ల ప్రజాధనం ఆదా అయిందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (YBP) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ (Yerra Kamesh) తెలిపారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేబీపీ చేసిన రాజీలేని పోరాటం వల్లే అధికారులు ఆన్‌లైన్ టెండర్లను అమలు చేయాల్సి వచ్చిందని, దీనివల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడి పోటీ పెరిగిందన్నారు.

డీపీఆర్ రద్దు సమయంలో ఆన్‌లైన్ టెండర్ ద్వారా రూపాయి తగ్గినా సన్మానం చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సవాల్ చేశారని, ఇప్పుడు రూ.2.40 కోట్లు ఆదా అయినందున ఆ ఛాలెంజ్‌లో జేబీపీ గెలిచిందని కామేష్ చెప్పారు. కాబట్టి తమకు ఎప్పుడు, ఎక్కడ సన్మానం చేస్తారో ఎమ్మెల్యే తేదీ సమయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో అన్ని టెండర్లను ఇదే పారదర్శకతతో నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, పట్టణ అధ్యక్షుడు గజ్జెల శంకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>