ఖవాజా కామెంట్స్‌పై స్టార్క్ రియాక్షన్!

కలం, స్పోర్ట్స్: సంచలనం సృష్టించిన 2018 ‘సాండ్‌పేపర్‌గేట్’ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్‌లో మళ్లీ మంటలు రేపుతోంది. మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చేసిన ఆరోపణలపై స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) తాజాగా స్పందించారు. సౌతాఫ్రికాతో జరిగిన కేప్‌టౌన్ టెస్టులో బంతిని రుద్దడానికి శాండ్‌పేపర్ వాడారనే నెపంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఓ ఏడాదితో పాటు కెమరాన్ బాన్‌క్రాఫ్ట్ తొమ్మిది నెలల నిషేధాన్ని ఎదుర్కొన్నారు. అయితే, ఖవాజా తన ఆత్మకథ ‘సబ్ర’లో సంచలన విషయాలు రాశారు. ఈ టాంపరింగ్ వ్యవహారం జట్టులోని అందరికీ తెలుసని ఆరోపించారు. పోర్ట్ ఎలిజబెత్ టెస్టులోనే శాండ్‌పేపర్ వాడారని, కేవలం ముగ్గురినే బలిపశువులను చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఈ వివాదంపై స్పందించిన స్టార్క్, ఖవాజా మాటలపై తాను దృష్టి పెట్టలేదని స్పష్టం చేశారు. 2021లో తమ బౌలర్లు ఇచ్చిన ఉమ్మడి ప్రకటనకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. పోర్ట్ ఎలిజబెత్ టెస్టులో శాండ్‌పేపర్ వాడకం గురించి ఖవాజా పుస్తకం ద్వారానే తొలిసారిగా విన్నానని స్టార్క్ తెలిపారు. మైదానంలోకి నిషేధిత వస్తువులు తెచ్చిన విషయం బౌలర్లకు తెలియదని, ఆ ఆరోపణల నిజానిజాలు రచయితలే వివరించాలని తేల్చిచెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>