కలం, జగిత్యాల: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ (Kandlapalli Model School) విద్యార్థినులు ప్రతిభ చాటారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) అండర్-19 బాలికల వాలీబాల్ పోటీల్లో పాఠశాలకు చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థినులు గమ్య, హరిణి అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.
ఈ పోటీలకు విద్యార్థినులకు పీడీ అజీమ్ కోచ్‌గా వ్యవహరించి శిక్షణ అందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను పాఠశాల ప్రిన్సిపాల్ సరితాదేవి, వైస్ ప్రిన్సిపాల్ నాగేష్, పీడీలు అజీమ్, వినీత్‌తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాలకు పేరు తీసుకురావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

