మోదీతో ఐ కాంటాక్ట్ పై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​: కాంగ్రెస్​ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) తన బయోగ్రఫీ ‘బిలాంగింగ్‌’లో కీలక విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న పరిచయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీతో తనకు పెద్దగా వ్యక్తిగత పరిచయం లేదని పేర్కొన్నారు. ఆయనతో ఇంత వరకు నేరుగా మాట్లాడలేదని రాసుకొచ్చారు. స్పీకర్‌ ఛాంబర్‌ వంటి అధికారిక సమావేశాల్లో మాత్రమే ఎదురుపడుతుంటామని చెప్పారు. అప్పుడు పరస్పరం లాంఛనంగా నమస్కరించుకుంటామన్నారు.

అయితే గతంలో వివిధ పార్టీల నాయకుల మధ్య ఉండే ఆప్యాయత ఇప్పుడు కనిపించడం లేదని ఆమె (Sonia Gandhi) అభిప్రాయపడ్డారు. మోదీ తనను ఎదురుగా చూసినప్పుడు కళ్లలోకి చూడకుండా ముఖం పక్కకు తిప్పుకుంటారని బయోగ్రఫీ లో సోనియాగాంధీ పేర్కొన్నారు. ఇక తమ ఇద్దరి భావజాలాలు, దేశం పట్ల దృక్పథాలు భిన్నమైనవని ఆమె స్పష్టం చేశారు. మోదీ తన భారత దృక్పథం కోసం పోరాడితే.. తాను ఆధిపత్యానికి వ్యతిరేకంగా, సమ్మిళితత్వం, లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం నిలబడే భారతదేశం కోసం పోరాడానని రాసుకొచ్చారు. ఈ రాజకీయ భేదాలు వ్యక్తిగతమైనవి కావని తన ఆత్మకథ బిలాంగింగ్ లో సోనియా గాంధీ  వివరించారు.

Also Read : కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. ఈసీ సంచలన నివేదిక!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>