మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కన్నుమూత!

కలం, వెబ్ డెస్క్: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ (Shaji Kumar).. మంగళవారం తెల్లవారుజామున కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. సినిమా షూటింగ్ సెట్‌లో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన ఆయనకు గత రెండు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

చనిపోవడానికి రెండు రోజుల ముందు అలప్పుజాలో దిలీప్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌లో షాజీ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అక్కడి వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తొలుత ఐసీయూలో చికిత్స అందించిన వైద్యులు.. ఆరోగ్యం కొంత సర్దుకోవడంతో సాధారణ గదికి మార్చారు. వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు నడుస్తూ తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలిపోయి తుదిశ్వాస విడిచారు.

సినిమాటోగ్రాఫర్‌గా షాజీ కుమార్ మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా మాస్ కమర్షియల్ సినిమాలకు అద్భుతమైన విజువల్స్ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర హీరోలు, దర్శకులతో కలిస పనిచేశారు. తన సుదీర్ష కెరీర్‌‌లో 50కి పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించి ప్రేక్షకులకు గుర్తిండిపోయే దృశ్యాలను అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>