కార్తీకమాసం ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

కలం, వెబ్ డెస్క్: వివాహాది శుభకార్యాల సీజన్ అయిన కార్తీకమాసంలో మళ్లీ పసిడికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక పరిణామాలు, డాలర్ హెచ్చుతగ్గులతో పాటు, స్థానికంగా పెరిగిన ఈ పండుగల ముహుర్తాల డిమాండ్ కూడా ప్రస్తుత బంగారం, వెండి ధరల భారీ పెరుగుదలకు (Gold Price Hike) ప్రధాన కారణాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,400 పెరిగి రూ. 1,44,600 కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ. 1,32,550కి చేరింది. కిలో వెండి ధర భారీగా రూ. 4,000 పెరిగి రూ. 2,59,900 వద్ద కొనసాగుతుంది. ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలుంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

Also Read : పుంగనూరు ఆవుకు భారీ డిమాండ్.. రికార్డు స్థాయిలో ధర

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>