వ్యవస్థీకృత లోపాల వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు: కూనంనేని

కలం, పెద్దపల్లి: రాష్ట్రంలో ప్రజలు వ్యవస్థీకృత లోపాల వల్లే ఎలాంటి దురలవాట్లు లేని ప్రజలు కల్తీ ఆహారం తిని చనిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) అన్నారు. కల్తీ ఆహారం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురై చిన్న వయసులోనే క్యాన్సర్ బారినపడి పడి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కనగర్తి గ్రామంలో జరిగిన సీపీఐ మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ తాళ్ళపెల్లి రమేశ్ సంతాప సభలో కూనంనేని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఎలాంటి దురలవాట్లు లేని సీపీఐ నాయకుడు రమేశ్ చిన్న వయసులోనే క్యాన్సర్ బారినపడి మరణించడం బాధాకరమని.. అతని మృతి పార్టీకి, కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఆహారంలో కల్తీ వల్లే కరోనా కంటే భయంకరంగా క్యాన్సర్ విజృంభించి చిన్న వయసులోనే ప్రజలు మరణిస్తున్నారని, దీనిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మడ్డి ఎల్లా గౌడ్ అద్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు కవ్వంపల్లి స్వామి, కన్నం లక్ష్మి నారాయణ, మిట్టపల్లి వెంకటస్వామి, గుంటి వేణు, బోయిన అశోక్, ఆది మధుసూదన్, మాజీ జెడ్పీటీసీ గంట రాములు, మాజీ ఎం.పి.టి.సి రామారావు, తదితరులు పాల్గొని మాట్లాడారు.

సభకు ముందు రమేశ్ స్మారక స్థూపం వద్ద నాయకులు పూలు వేసి నివాళులు అర్పించారు. కళాకారులు తాళ్ళపెల్లి నారాయణ బృందం స్మృతి గీతాలు ఆలపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు ఎంఏ గౌస్, రమేశ్ కుటుంబ సభ్యులు శంకర్, మల్లయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>