ఖమ్మంలో టపాసుల మోత.. తగ్గిన గాలి నాణ్యత!

కలం, ఖమ్మం బ్యూరో: దీపావళి పండుగ సందర్భంగా టపాసులతో మోతతో వెలువడిన దట్టమైన పొగతో ఖమ్మం (Khammam) నగరం ఉక్కిరిబిక్కిరైంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అధికారులు ఎంతగా ప్రచారం చేసినా, ప్రజల నుంచి ఆశించిన స్పందన కరువైంది. పర్యావరణ పరిరక్షణ కోసం కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడాలని చేసిన విజ్ఞప్తులను గాలికొదిలేసిన నగరవాసులు విపరీతంగా బాణసంచా కాల్చడంతో కాలుష్య స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరాయి. సోమవారం ఉదయం నగరంలో గాలి శాంపిల్స్ పరిశీలించగా కాలుష్య కారకాల తీవ్రత బయటపడింది. కార్బన్ మోనాక్సైడ్ 1019 ppb, సల్ఫర్ డయాక్సైడ్ 4 ppb, నైట్రోజన్ డయాక్సైడ్ 11 ppbగా నమోదయ్యాయి.

ఓజోన్ స్థాయి ప్రమాదకరంగానే..

ముఖ్యంగా ఓజోన్ శాతం లెవెల్స్ ఏకంగా 55 ppbగా నమోదు కావడం పట్ల పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ​బాణసంచా నుంచి వెలువడిన విషపూరిత పొగ కారణంగా నగరంలోని పలు ప్రాంతాలలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. విపరీతమైన కాలుష్యం, ఉక్కబోత కారణంగా ఉబ్బసం, శ్వాసకోస సమస్యలు ఉన్నవారితో పాటు చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగ ఆనందం ముసుగులో పర్యావరణం, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నా ప్రజల్లో మార్పు రాకపోవడంపై పర్యావరణ వేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>