5 రాష్ట్రాల్లో ఎన్నికలు..షెడ్యూల్ ఎప్పుడంటే!

కలం, వెబ్ డెస్క్: అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) సిద్ధమవుతోంది. 2027లో జరగబోయే ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాలకు సంబంధించి జనవరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి, మార్చి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయితే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే సర్ జాబితా అంశం కూడా కొలిక్కి వచ్చింది.

ఈ నేపథ్యంలో అయిదు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనేది ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకం కాబోతుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఇక్కడున్న పార్లమెంట్ సీట్లు కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

Also Read : ఉద్యోగుల సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>