కలం, నల్లగొండ : జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (National ST Commission) సభ్యులు జాతోతు హుస్సేన్ ఈనెల 12న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనతోపాటు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ అమిత్ నిర్మల్, డైరెక్టర్ డాక్టర్ పి. కళ్యాణ్ రెడ్డి, కన్సల్టెంట్ ఎం. కిరణ్ కుమార్ కూడా జిల్లాకు రానున్నట్లు వెల్లడించారు.
పర్యటన వివరాల ప్రకారం.. కమిషన్ (National ST Commission) సభ్యులు ఈనెల 12వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్లగొండకు చేరుకుంటారు. ముందుగా జిల్లాలోని పలు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) గ్రామాలను సందర్శించి గిరిజనుల జీవన ప్రమాణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు నల్లగొండ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లాలోని గిరిజనులకు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై దిశానిర్దేశం చేస్తారు.
Also Read : ఇడుపు కాయితం నుంచి మరో క్రేజీ అప్‌డేట్!
Follow Us On : WhatsApp

