జాతీయ జెండా పార్కు వద్ద దుకాణాల అనుమతులపై కలెక్టర్‌కు బీజేపీ ఫిర్యాదు.

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ చెరువు సమీపంలో ఉన్న జాతీయ జెండా పార్కు వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల అనుమతులపై (Shop Permissions) విచారణ జరిపించాలని బీజేపీ కౌన్సిలర్లు (BJP Councillors) జాదవ్ సూరజ్ నాయక్, అయిండ్ల విజయలక్ష్మి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్కు స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ఎవరు అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు.

ఎలాంటి టెండర్ ప్రక్రియ నిర్వహించకుండా తమకు అనుకూలమైన వారికి దుకాణాలు కేటాయించడం సరికాదని ఆరోపించారు. పార్కు స్థలంలో వాణిజ్య కార్యకలాపాలకు ఎలా అనుమతులు ఇచ్చారో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించి, నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>