స్వప్రయోజనాలు కాదు.. ప్రజా ప్రయోజనాలే ముఖ్యం: బండారు రమేష్

కలం, బోనకల్: కమ్యూనిస్టులు నిరంతరం అధ్యయనం చేస్తూ, ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని ఖమ్మం జిల్లా రాజకీయ విద్యా విభాగం నాయకులు బండారు రమేష్ పిలుపునిచ్చారు.  ఖమ్మం జిల్లా బోనకల్ స్టడీ సర్కిల్ (Bonakal Study Circle) 100 వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బోనకల్ మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో స్టడీ సర్కిల్ కన్వీనర్ తెల్లాకుల శ్రీనివాసరావు అధ్యక్షతన ‘మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి?’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన బండారు రమేష్ కమ్యూనిస్టుల బాధ్యతలు, పార్టీ సిద్ధాంతాలు, ప్రజా ఉద్యమాల ప్రాధాన్యతపై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూర్జువా సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నాయని, వాటికి కమ్యూనిస్టులు ప్రభావితం కాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధ్యయనంతో పాటు ప్రజల్లో మమేకమై వారి సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని పేర్కొన్నారు.

‘నేనే’ అనే అహంకార భావన కమ్యూనిస్టులకు బద్ధశత్రువని, వ్యక్తిగత స్వప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మంచి కమ్యూనిస్టు తనను తాను ఎప్పటికప్పుడు సానబెట్టుకుంటూ, సమాజంలోని రుగ్మతలకు లోనుకాకుండా ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించాలని సూచించారు.

పార్టీ సూత్రాలకు అనుగుణంగా నడుచుకుంటూ సమాజ హితం కోసం పనిచేయడమే నిజమైన కమ్యూనిస్టు లక్షణమని అన్నారు. మంచి కమ్యూనిస్టు తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ సమాజానికి వెలుగునివ్వాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు మార్క్స్, లెనిన్ బోధించిన సిద్ధాంతాలు, సూత్రాలు మార్గదర్శకంగా నిలుస్తాయని వివరించారు.

ఈ నెల 15వ తేదీన నల్లగొండ పట్టణంలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ బహిరంగ సభకు బోనకల్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బండారు రమేష్ కోరారు.

ఈ కార్యక్రమంలో చింతలచెరువు కోటేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, కిలారు సురేష్, బంధం శ్రీనివాసరావు, గుగులోతు నరేష్, జొన్నలగడ్డ సునీత, కూచిపూడి మురళి, బూర్గుల అప్పచారి, పిల్లలమర్రి వెంకట అప్పారావు, బొప్పాల రమేష్, పిల్లలమర్రి ఝాన్సీ రాణి, కంసాని సూర్య ప్రకాష్ రావు, దొండపాటి సత్యనారాయణ, గద్దె రామారావు, బిళ్ళ విశ్వనాథం, కొమ్మినేని నాగేశ్వరరావు, కొండేటి అప్పారావు, పెద్దప్రోలు కోటేశ్వరరావు, వై. రామారావు, సిహెచ్. నాగేశ్వరరావు, చామర్తి వెంకటేశ్వర్లు, పొన్నం నాగేశ్వరరావు, పొన్నం రామకృష్ణ, పొన్నం ఉపేంద్ర, పి. కోటేశ్వరరావు, దారగాని కృష్ణమూర్తి, సిహెచ్. రమేష్, చెడే సాయిబాబా, కె. ప్రవీణ్, ఎస్. వంశీ, రచ్చ శివ, ఏసుపోగు బాబు, కొండ శ్రీనివాసరావు, కొంగర భూషయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>