ఫ్యామిలీతో గ్రీస్‌కు స్టాలిన్‌.. ఎందుకంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌మిళ‌నాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) నేడు త‌న కొడుకు ఉద‌య‌నిధి స్టాలిన్‌తో క‌లిసి చెన్నై నుంచి గ్రీస్‌కు బ‌య‌లుదేరారు. వీరితో పాటు మొత్తం ఫ్యామిలీ గ్రీస్ వెళ్లారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ అనిరుధ్ రవిచందర్, ఎస్ఆర్‌హెచ్ అధినేత్రి కావ్య మారన్‌ల పెళ్లికి హాజ‌ర‌య్యేందుకే వారు గ్రీస్ వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. నవంబర్ 11న బుధవారం నాడు గ్రీస్‌లో ఈ పెళ్లి జ‌రుగ‌నుంది. ఈ పెళ్లికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, ఈ వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. వీరు నవంబర్ 13న తిరిగి చెన్నై చేరుకోనున్నారు. మళ్లీ నవంబర్ 21న మారన్ కుటుంబం చెన్నైలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్.. ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్వాహకురాలిగా అందరికీ తెలుసు. మారన్, స్టాలిన్ (MK Stalin) కుటుంబాల మధ్య దశాబ్దాల బంధుత్వం ఉంది. మరోవైపు, ‘వై దిస్ కొలవెరి డీ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనిరుధ్ రవిచందర్, జైలర్, విక్రమ్, లియో, జవాన్ వంటి భారీ చిత్రాలకు సంగీతాన్నిందించి అగ్రశ్రేణి కంపోజర్‌గా నిలిచారు. అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర.. సూపర్‌స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్‌కు సోదరుడు కావడం విశేషం. దీంతో ర‌జినీ కాంత్ ఫ్యామిలీ కూడా పెళ్లికి హాజ‌ర‌య్యే ఛాన్స్ ఉంది.

Also Read : క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. తగ్గిన 137 ఔషధాల ధరలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>